Tuesday 25 October 2016

త్వరలో జనసేనకి ఒక పవర్ ఫుల్ వ్యక్తి రాబోతున్నాడు

త్వరలో జనసేనకి ఒక పవర్ ఫుల్ వ్యక్తి రాబోతున్నాడు ఇంతకీ ఆ పవర్ ఫుల్ వ్యక్తి ఎవరూ అనే కదా మీ డౌట్...ప్రస్తుతం దేశప్రధాని గా ఉంటున్న నరేంద్ర మోదీకి ఒకప్పుడు రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్. అవును...2012లో గుజరాత్ ఎన్నికలకు వెళ్ళాడు. కానీ అప్పటికే సీయం అయిన మోదీ, ఈ సారి గెలవరని చాలా మంది అప్పట్లో జ్యోశ్యం చెప్పారు. కానీ అందరూ అనుకున్నట్టు కాకుండా భారీ మెజారిటీతో గెలిచి 2014లో ప్రధాని పీఠంకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే...ఈ కథ అంతా తెరవెనుక నుంచి నడిపించింది కూడా ప్రశాంతే. స్వతహాగా విదేశాల్లో ఉద్యోగం చేసుకునే ప్రశాంత్ కిషోర్, ఆ తరువాత ఇండియా వచ్చి ప్రముఖ నేతలకు రాజకీయ పాఠాలు నేర్పుతున్నారు.అసలు మోదీ ప్రధాని అవ్వడానికి కూడా ప్రశాంత్ కీలక పాత్ర పోషించాడని చెప్తున్నారు. కొన్ని రోజులకి ఈయన ప్లానింగ్ నచ్చడంతో ఆతరువాత బీహార్ సీయం నితీష్ కూడా అప్రోచ్ అయ్యారు.అప్పటికే బీహార్ లో బీజీపీకి విజయం ఖాయం అని అందరూ ఫిక్స్ అయిన సమయంలో ప్రశాంత్ రంగంలోకి దిగి నితీష్ ను సీయంగా గెలిపించారు. జాతీయ స్థాయిలో అంతటి సత్తా ఉన్న ఈ పవర్ ఫుల్ మ్యాన్..త్వరలో జనసేనకి రథసారధిగా ఉంటారా? అంటే నిజమే అనే ఆన్సర్ వినిపిస్తుంది. కానీ ఇప్పుడే కాదట. కాస్త టైం తీసుకొని సరైన సమయంలో పవన్ తో చెయ్యి కలపనున్నాడట ప్రశాత్ కుమార్. ఇదిలా ఉంటే..పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రశాంత్ ను కలిశారని, అన్నీ అనుకునట్టు జరిగితే వచ్చే ఎన్నికల్లో ప్రశాత్ నుంచి సలహాలు తీసుకునే ఆలోచనలో జనసేన అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే తన అభిమాన నటుడికి విజయం ఖాయం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాస్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో..

No comments:

Post a Comment